AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అడుగడుగునా బ్రహ్మరథం .. రాహుల్ ఆత్మీయతకు ఖమ్మం ఫిదా..

రాహుల్‌ని చూసిన జనం ఆనందంతో గర్జించారు. ఖమ్మం జనగర్జన సభకు వచ్చిన ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్‌ జన జాతరలో అపురూప దృశ్యాలను అందరికి బహుమతిగా అందించారు రాహుల్‌ గాంధీ. ఆయన చూపించిన ఆత్మీయతకు నేతలే కాదు ప్రజలు కూడా ఫిదా అయిపోయారు. జనగర్జన సభలో కొన్ని దృశ్యాలు ఫొటో తీసుకుని ఫ్రేమ్‌ కట్టించాలనుకునేంతగా అందరిని ఆకట్టుకున్నాయి. అవి జనం మైండ్‌లో పర్మనెంట్‌గా ప్రింట్‌ అయిపోయాయి.

ఖమ్మం గుమ్మంలో రాహుల్‌కి జనం నీరాజనం పట్టారు. సభా ప్రాంగణానికి ఓపెన్‌ టాప్‌ కారులో వెళ్లిన రాహుల్‌గాంధీకి.. రోడ్డుకు రెండువైపులా బారులు తీరిన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు ఆయనను అనుసరించారు. చకచకా నడుచుకుంటూ వెళ్లిన రాహుల్‌ గాంధీకి పొంగులేటి శాలువా కప్పి సత్కరించారు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. పాదయాత్ర చేసిన భట్టిని అభినందించిన రాహుల్.. ఆయన భుజం మీద చేతులు వేసి వేదికపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఇక ప్రజా యుద్ధనౌక గద్దర్‌.. రాహుల్‌కి ముద్దు పెట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. తనకు కండువా కప్పిన సీతక్కను రాహుల్‌ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటికి కండువా కప్పి నేనున్నా అంటూ చెయ్యి అందించి భరోసా ఇచ్చారు కాంగ్రెస్‌ అగ్రనేత. సభలో రేణుకా చౌదరిని పక్కనే కూర్చోపెట్టుకున్నారు రాహుల్‌. ఆయన స్పీచ్‌ను తెలుగులోకి అనువాదం చేశారు టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. ఇక రాహుల్ సభలో జై జగన్‌ జెండాలు కూడా కనిపించాయి. కాగా, ‘జన గర్జన’ సభ గ్రాండ్‌ సక్సెస్‌ కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ నింపింది.

ANN TOP 10