AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

ఆమోదించిన ఏపీ సీఎం

తెలంగాణ మాజీ చీఫ్‌ సెక్రటరీ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీఆర్‌ఎస్‌ తీసుకోవాలని వ్యక్తిగతంగా అభ్యర్థించడం కారణంగానే పోస్ట్‌ కేటాయించలేదని.. ఏపీ సర్కారు పేర్కొంది. ఆయన వీఆర్‌ఎస్‌ను ఆమోదించింది.

గతంలో తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్‌కుమార్‌ను ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారించింది. ఏపీకి బదిలీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జనవరి 12న ఏపీ కేడర్‌లో రిపోర్ట్‌ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కూడా కలిశారు. ఈ పరిణామాలు జరిగి సుమారు నెల రోజులు గడిచినప్పటికీ ఏపీ ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ కు పోస్ట్‌ కేటాయించలేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన వ్యక్తిగ అభ్యర్ధన మేరకే ఎలాంటి పదవి కేటాయించలేదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

ANN TOP 10