జోగు రామన్న, పాయల్ శంకర్ ఇద్దరూ ఒక్కటే
ఉదయం దందాలు.. రాత్రి వేళ విందులు
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు
ఆదిలాబాద్: ఎమ్మెల్యే జోగు రామన్న పచ్చి అబద్ధాల కోరని, అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. గడపగడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్ననినాదంతో కంది శ్రీనివాసరెడ్డి బేల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కొగ్దూర్ లో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అవగాహన కల్పించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. జోగురామన్న ఒక అసమర్ధ ఎమ్మెల్యే అని తర్నం బ్రిడ్జి దుస్థితికి ఆయనే కారమన్నారు.
ఆయన కుమారుడు రిమ్స్ లో ఉద్యోగాలు అమ్ముకున్నాడన్నారు. తాను చెప్పింది నిజమని తన కుటుంబ సభ్యుల తో జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తన మాటలు అబద్ధమని జోగు రామన్నకుటుంబంతో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. నాలుగుసార్లు జోగు రామన్నకు అవకాశమిచ్చారని, ఈసారి కాంగ్రెస్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే తాను అమెరికా నుండి వచ్చానన్నారు. జోగు రామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటేనని కలిసి దందాలు చేస్తారన్నారు.పగటి పూట విమర్శించుకోవడం, రాత్రిపూట కలుసుకోవడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ ఏక్ నంబర్ వసూల్ రాజా అంటూ విమర్శించారు.
జోగు రామన్నను ఓడించడమే తన లక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మనోజ్ ,మాజీ ఎంపీటీసీ రెంజర్ల రాజన్న, బేల మండలం ప్రెసిడెంట్ ఫైజుల్లా ఖాన్, ఎస్. టి సెల్ చైర్మన్ మాడవి చంద్రకాంత్, మాజీ మార్కెట్ చైర్మయిన్ వామన్ వంకాడే,గిమ్మసంతోష్ ,నాగర్కర్ శంకర్ ,అల్లూరి అశోక్ రెడ్డి ,దీపక్ రావు, చిత్రు, భీమ్ రావు పటేల్, ఓసావర్ సురేష్, శంకర్, ప్రభాకర్ రావు,గేడం అశోక్,రామ్ రెడ్డి, షేక్ షాహిద్,తాడ్సే భాస్కర్, గణేష్, దత్తజీ చౌహన్, గులాబ్ చౌహన్,షేక్ సైఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.