కర్ణాటక రాష్ట్రంలో ఘోరమైన సంఘటన జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడి గొంతు కోసి అతని రక్తం తాగాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో జరిగింది. చిక్కబల్లాపూర్‌కు చెందిన విజయ్, మారేశ్ స్నేహితులు. అయితే మారేశ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విజయ్ అనుమానం పెంచుకున్నాడు.
దీంతో అతనిని మాట్లాడాలని పిలిచి నిర్మాణుశ్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇదే విషయమై ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో తనతో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మారేశ్ గొంతు కోశాడు విజయ్. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. మారేశ్ గొంతు నుంచి కారుతున్న రక్తాన్ని తాగడానికి ప్రయత్నించాడు. అయితే ఇందంతా చూసిన ఓ వ్యక్తి.. తన ఫోన్‌లో వీడియో తీశాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. నిందితుడు విజయ్‌ను అరెస్టు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన మారేశ్ పరిస్థితి ప్రస్తుతం నిలకగడానే ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.