AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్ రెడ్డి కిడ్నాప్ కేసులో కీలక మలుపు..

సిద్దిపేట బీజేపీ నేత అరెస్ట్
మేడ్చల్ జిల్లా ఘాట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన అవినాష్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో సిద్దిపేట జిల్లాకు చెందిన బీజేపీ నేత చక్రధర్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కిడ్నాప్ చేయడానికి గల కారణాలు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం, నగదు లావాదేవీలే అవినాష్ రెడ్డి కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చారు.

అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మేడిపల్లి శివారులో నివాసం ఉంటున్నాడు. తన క్లాస్‌మెట్ అయిన అన్షిత రెడ్డితో కొన్ని సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అయితే అవసరాల కోసం తనకు డబ్బులు కావాలని ప్రియుడిని కోరింది. దీంతో ప్రియురాలికి అవినాష్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు పంపించింది. అయితే అవినాష్ రెడ్డిని వదిలేసి అన్షిత రెడ్డి గత కొంతకాలంగా సిద్దిపేట బీజేపీ నేత చక్రధర్ గౌడ్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. చక్రధర్ గౌడ్‌తో పలుమార్లు అవినాష్ రెడ్డికి ఫోన్ చేయించింది. అన్షిత రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను తొలగించాలని చక్రధర్ గౌడ్ బెదిరించాడు.

ఈ క్రమంలో ఘట్కేసర్‌లోని వరంగల్ హైవే దగ్గర ఉన్న వందన హోటల్ వద్దకు రావాలని, అక్కడ మాట్లాడుకుని గొడవ సెటిల్ చేసుకుందామంటూ అవినాష్ రెడ్డిని చక్రధర్ గౌడ్ పిలిచాడు. దీంతో ప్రియురాలికి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకంతో అవినాష్ రెడ్డి హోటల్ వద్దకు వెళ్లాడు. ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం.. అవినాష్ రెడ్డిని చక్రధర్ కారులోకి కూర్చోబెట్టి మాట్లాడాడు. అనంతరం తన అనుచరులతో దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చాకచక్యంగా వ్యవహారించి కిడ్నాపర్ల నుండి అవినాష్ రెడ్డి తప్పించుకున్నాడు. అవినాష్ రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు వెంట పడటంతో బుల్లెట్ బండి వదిలేసి దుండగులు పరార్ అయ్యారు.

ఈ కిడ్నాప్ ఎపిసోడ్‌పై పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. నిందితుడు చక్రధర్ గౌడ్‌తో పాటు అనుచరులను అరెస్ట్ చేశారు.

ANN TOP 10