AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ లో తప్పిన భారీ పెను ప్రమాదం..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పెనుప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం భారీ బండరాళ్లతో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడింది. మాదాపూర్ హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. భారీ బండరాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మాదాపూర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ANN TOP 10