భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు. కాగా, రుద్రప్రయోజ్ జిల్లాతో పాటు పలు జిల్లాలో భారీగా వర్షాపాతం నమోదైంది. హరిద్వార్‌లో గత 24 గంటల్లో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, డెహ్రాడూన్‌లో 33.2, ఉత్తరకాశిలో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతత నమోదైనట్టు భారత వాతావారణ శాఖ తెలియజేసింది.
