AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘అన్నా వస్తున్నా.. మిమ్మల్ని కలుస్తా’.. ఎన్నికల వేళ బండ్ల గణేష్ ట్వీట్

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే బండ్లన్న.. సినిమా, పాలిటిక్స్‌కు సంబంధించి ఆసక్తికర ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి సినిమా రంగానికి దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు ఈవెంట్లలో పాల్గొని తన పవర్‌ఫుల్ స్పీచ్‌లతో అదరగొడుతుంటారు. తాజాగా.. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర నేడు సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో తాను భట్టి పాదయాత్రలో పాల్గొంటానని బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు భట్టి చేపట్టిన పాదయాత్రలో భాగం అవుతానని అన్నారు. ‘అన్నా వస్తున్నా.. అడుగులో అడిగేస్తా.. చేతిలో చెయ్యేస్తా.. కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారి తీసింది.

ANN TOP 10