తెలంగాణలో పేదల కోసం దళితబంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షల సాయాన్ని అందించనున్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా పలువురికి దళితబంధు అందించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు చెబుతుంది సర్కార్. రైతుబంధు నిధుల జమ, ధాన్యం కొనుగోలు డబ్బులు రిలీజ్, కులవృత్తులకు లక్ష సాయం, పోడుభూములకు పట్టాల పంపిణీ ఇలా అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుస్తుంది.
ఇక తాజాగా రాష్ట్రంలోని పేదల కోసం దళితబంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షల సాయాన్ని అందించనున్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా పలువురికి దళితబంధు అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నియోజకవర్గానికి 1100 మందికి అంటే 118 నియోజకవర్గాల్లో 1,29,800 మందికి దళితబంధు అందించాలని నిర్ణయించింది. ఒక్క హుజురాబాద్ తప్ప రాష్ట్రమంతా దళితబంధు అందజేయనున్నారు.