AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫలించని జేపీ నడ్డా మంత్రాంగం.. కాంగ్రెస్‌లోకి ఖాయమేనా?

బీజేపీ ముఖ్య నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ తర్వాత కూడా ఈటల, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియాతో ముక్తసరిగా మాట్లాడి ఈటల వెళ్లారు. కేంద్రమంత్రులతో కేటీఆర్ వరుస సమావేశాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాయని ఈ ఇద్దరు అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు.

అది బీజేపీ ఎదుగుదలకు తీరని విఘాతం అంటున్నారు. ఈటల, రాజగోపాల్ రెడ్డికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా.. దానిపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని ఆయన.. మీడియాలో కూడా మాట్లాడటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండటంతో.. తిరిగి రాజగోపాల్‌రెడ్డి హస్తం గూటికి వస్తారనే చర్చ నడుస్తోంది.

ఇప్పటికే వారిద్దరిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. తనను గతంలో విమర్శించినా తాను అవి పట్టించుకోనని, పార్టీలోకి రావాలని రాజగోపాల్ రెడ్డి, ఈటలను ఆహ్వానించడం ఇటీవల ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డి తొలి నుంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయాాలు చేస్తోన్నారు. ఇక మంత్రి పదవిని నుంచి బర్త్‌రఫ్ చేసిన తర్వాత కేసీఆర్‌ను ఈటల తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం, ఇటీవల బీఆర్ఎస్-బీజేపీ దగ్గరవ్వడాన్ని ఆ ఇద్దరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

ANN TOP 10