వైఎస్సాఆర్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు, ప్రచారం జరుగుతున్న వేళ ఇందుకు ఊతమిచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడో రేపో షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది. ఈ పర్యటనలో ఆమె కాంగ్రెస్ ముఖ్యనేతలో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కాగా వైఎస్ షర్మిల ఇప్పటికే కార్ణటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే.
ఢీకేతో భేటీ అయిన మరుసటి రోజే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, షర్మిల మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఏపీలో షర్మిల సేవలను వాడుకునేందుకు వీలుగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రతిపాదించారని.. విలీనానికి షర్మిల ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి.
విలీనం లేదా పొత్తు ప్రతిపాదనలపై అటు హైకమాండ్, ఇటు షర్మిలకు మధ్య సమన్వయకర్తగా శివకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని షర్మిల చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం సాధించే దిశగా వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు షర్మిల అంగీకరిస్తే, ప్రస్తుతం వైఎస్ఆర్టీపీలో ఉన్న చాలా మంది నేతలు మళ్లీ సొంతగూటికి వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.