తెలంగాణలో స్కూల్స్ పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో హాజరుశాతం పెరుగుతుంది. ఇప్పటికే విద్యార్థులకు వర్క్ బుక్స్, టెక్ట్ బుక్స్, యూనిఫామ్ దుస్తులు అందజేశారు. ఈ ఏడాది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కూడా మారిపోయింది. అంతేకాదు మరికొన్ని విప్లవాత్మక మార్పులు సైతం తీసుకువచ్చారు. రోజూ ఉదయం 5 నిమిషాలు యోగా లేదా ధ్యానం చేయాలి. ప్రతి వారం 3 నుంచి 5 పిరియడ్లు పిల్లలు ఆటలు ఆడుకునేందుకు కేటాయించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు ‘నో బ్యాగ్ డే’ అనే వినూత్న కార్కక్రమానికి శ్రీకారం చుట్టింది. నెలలో నాలుగవ శనివారం నాడు విద్యార్థులు పుస్తకాల బ్యాగులు రాకుండానే పాఠశాలకు రావొచ్చు.
ఈ లెక్కన ఏడాదిలో 10 రోజులు నో బ్యాగ్ డే ఉంటుంది. ఆ రోజున విద్యార్థుల ఆసక్తిని బట్టి.. 28 రకాల కార్యకలాపాలు చేయించవచ్చు. మ్యూజియంలు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశాలు, గ్రామ పంచాయితీలు సందర్శించవచ్చు. మోడల్ ఎలక్షన్స్, మోడల్ అసెంబ్లీ, డూడ్లింగ్, సైన్స్ ప్రయోగాలు వంటి వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవచ్చు. వీరికి ఇంకా చాలా ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రైవమరీ లెవల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలపై కూడా అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో వీటిని తప్పనిసరి చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది.