సీనియర్ నటి ఖుష్బూ తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె అంతలా షేర్ చేసిన ఫొటో ఏంటో తెలుసా!..ఆమె హాస్పిటల్ బెడ్‌పై ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు కంగారు పడ్డారు.
అసలు విషయం ఏంటంటే.. ఖుష్బూ కొన్ని రోజులుగా కోకిక్స్ ఎముక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కూర్చునే సమయంలో నొప్పితో బాధపడతారు. అలాగే మలం వెళ్లటానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీన్ని చెక్ చేసిన వైద్యులు ఆపరేషన్ చేస్తే చాలని అన్నారు. వారి సూచన మేరకు శస్త్రచికిత్స చేసుకున్నారు ఖుష్బూ. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఖుష్బూ ఈ మధ్య తను చేస్తోన్న కామెంట్స్ వల్ల సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారుతున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఆమె స్పందించారు. కన్న తండ్రి తనను 8 ఏళ్ల వయసులోనే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. 15 ఏళ్లు వచ్చిన తర్వాత తండ్రిని ఎదిరించటం మొదలు పెట్టానని చెప్పటం. 16 ఏళ్ల వయసులో తండ్రి తమ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయినట్లు ఖుష్బూ పేర్కొనటం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.