AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పంజాబ్‌ సీఎం ఫిదా

కొండపోచమ్మను సందర్శించిన భగవంత్‌ మాన్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలకు, పాలనకు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల నేతలు ఫిదా అవుతున్నారు. తాజాగా పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా కేసీఆర్‌ పాలనకు మాటలకు ఫిదా అయిపోయారు. కేసీఆర్‌ ఫ్యాన్‌ అయిపోయారన్న చర్చ సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. కొత్త తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడినప్పటికీ పంజాబ్‌ సీఎం తన టూర్‌ ను వాయిదా వేసుకోకుండా తెలంగాణకు రావడం విశేషం. కేసీఆర్‌ ను స్వయంగా కలిసి ఇక్కడ అభివృద్ధిని చూపించాలని కోరారని.. ఈ మేరకు పంజాబ్‌ సీఎం టూర్‌ కు కేసీఆర్‌ అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

ముందుగా సిద్దిపేట జిల్లాలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పర్యటించారు. గురువారం కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ను సీఎం భగవంత్‌ మాన్‌ సందర్శించారు. ఎర్రవెల్లి చెడ్‌ డ్యామ్‌ వద్దకు చేరుకొని డ్యామ్‌ను పరిశీలించారు. భగవంత్‌ మాన్‌ వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనను దేశమంతా పొగుడుతుంటే భగవంత్‌ మాన్‌ మాత్రం కేసీఆర్‌.. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధికి ఫిదా అయిపోయారు. తెలంగాణ అభివృద్ధిని దేశానికి పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ANN TOP 10