AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. కుప్వారాలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన.

ఈ వారంలో జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ సమీపం కుప్వారాలోని మచల్ సెక్టార్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను చూసిన భద్రతా బలగాలు అప్రమత్తమై కాల్పులు ప్రారంభించాయి. ఎదురుదాడికి దిగిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ నెల 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు.

ANN TOP 10