AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమలలో బాలుడిపై చిరుత దాడి

తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. నడకమార్గంలో వెళ్తుండగా బాలుడిని చిరుత పులి లాక్కెళ్లింది. భక్తులు కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లింది. బాలుడి చెవి వెనుక, మెడ, తలకు గాయాలయ్యాయి. పద్మావతి చిల్ట్రన్ ఆస్పత్రిలో బాలుడి కౌశిక్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాలుడిని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సుబ్బారెడ్డి తెలిపారు. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నడక మార్గంలో భద్రతను మరింతగా పెంచుతామన్నారు.

ANN TOP 10