AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పటాన్ చెరు అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణలో తొలి అభ్యర్ధిని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని… మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం సంగారెడ్డి జి ల్లాలో పర్యటించిన సిఎం కేసీఆర్ పటాన్‌చెరు రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. ఈ సందర్భంగా పటాన్ చెరు అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోసారి స్థానిక మహిపాల్ రెడ్డిని దీవించాలని కోరారు. తాము చెప్పింది చేస్తామని.. మాట తప్పమని స్పష్టం చేశారు. మోసపోతే.. గోసపడుతాం… ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరం గా ముందుకెళ్తున్నామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

మన రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని సిఎం కెసిఆర్ ప్రజలను కోరారు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు చేశారో.. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామని అన్నారు.

ANN TOP 10