AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నిరసన

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన కంది శ్రీనన్న
అవినీతికి పాల్పడుతున్న జోగురామన్నను నిలదీయాలని ప్రజలకు పిలుపు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో చేస్తున్న దగాకు నిరసనగా గురువారం కలెక్టర్‌ ఆఫీస్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ భూదందాలు, అక్రమ దందాలు చేస్తూ ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు ఎమ్మెల్యే జోగురామన్ననే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కొడుకు రిమ్స్‌లో ఉద్యోగాలు అమ్ముకుంటే.. తండ్రి జోగురామన్న అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని కంది మండిపడ్డారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట దిష్టిబొమ్మ దగ్ధం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఇరువురికి తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ANN TOP 10