నిజామాబాద్ జిల్లా: బోదన్ పట్టణంలో అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికపై బీఆర్ఎస్ నేత (BRS Leader) రవీందర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై గత కొంతకాలంగా రవీందర్ అత్యాచారం చేస్తున్నట్లు తెలిసింది. విషయం బయటపడడంతో బాధిత కుంటుంబాన్ని ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) పరామర్శించారు. ఈ ఘటనకు కారకుడైన రవీందర్‌తో సహా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇద్దరు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు.
