వారం వ్యవధిలో ముగ్గురి హత్య
సైకోను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ శివారు మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన డబుల్ మర్డర్ నగరంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. నగరంలోని వీధుల్లో తిరుగుతూ.. బ్లాంకెట్లు అమ్ముకునే జీవినం సాగించే వక్తిని, రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని గ్రానెట్ రాళ్లతో మోది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలో జరిగిన ఈ హత్యలతో స్థానికులు హడిలిపోయారు. ఈ జంట హత్యలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా చేసుకొని నిందితుడిని పట్టుకున్నారు.
అయితే పట్టుబడిన వ్యక్తి సైకో కిల్లర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు నగరంలోని నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్ ప్రాంతాల్లో తిరుగుతూ.. వరుస హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని ఈ సీరియల్ కిల్లర్ హత్యలకు పాల్పడుతున్నారు. మైలార్ దేవ్‌పల్లిలో బుధవారం ఇద్దరిని హతమార్చగా.. ఈ నెల 7న రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కూడా దారుణంగా హతమార్చినట్లు విచారణలో తేలింది. గంజాయికు అలవాటు పడిన వారు ఈ తరహా హత్యలు చేస్తారని పోలీసులు చెబుతున్నారు. సైకో కిల్లర్ ఇంకా ఇలా ఎవరినైనా హతమార్చాడా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.