ఎమ్మెల్యే జోగురామన్నకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం
రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి
జైనథ్ మండలంలో గడపగడపకు కాంగ్రెస్.. కార్యక్రమం
డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు
ఆదిలాబాద్: గడపగడపకు కాంగ్రెస్.. పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జైనథ్ మండలంలో పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. పార్డీ (కే) గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు కంది శ్రీనన్న కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను కంది శ్రీనివాసరెడ్డి అడిగి తెలుసుకున్నారు.
పార్డీ కేలో గడప గడప తిరిగి కాంగ్రెస్ డిక్లరేషన్ల పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అవినీతి పాలన పై కంది శ్రీనివాస రెడ్డి నిప్పులు చెరిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆదిలాబాద్ కు ఏం చేసినవ్ జోగురామన్నా అని ప్రశ్నించారు. సొంత ఆస్తులు కూడ బెట్టు కోవడం తప్ప చేసిందేమీలేదని విమర్శించారు. పార్డీకేలోబ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకం వేసి పనులు చేపట్టకపోవడంపై మండి పడ్డారు. ఇదేనా నీ అభివృద్ధి అని నిలదీసారు.
ఈసారి నువు ఓట్ల కోసం వస్తే ప్రజలు తిరగ బడతరు జాగ్రత్త అని హెచ్చరించారు. కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో ఇండ్లిచ్చింది , భూములిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే చేసే అభివృద్ధి పథకాలను వివరించారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అష్టక్ మాధవ్ ,దయాకర్ ,గౌతమ్, గంగారాం, నారాయణ ,జ్ఞాన్ భవ్,గిమ్మసంతోష్ రావు,నాగర్కర్ శంకర్,అల్లూరి అశోక్ రెడ్డి ,పిడుగు స్వామి యాదవ్ ,కిష్టారెడ్డి , సంతోష్ రెడ్డి ,సంజీవ్ ,పోతురాజ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.