బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్. వరుసగా రేట్లు పతనమవుతూనే ఉన్నాయి. వారం 10 రోజులుగా తగ్గుతూనే ఉన్న గోల్డ్ రేటు తాజాగా మరోసారి పడిపోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ మార్కెట్లు సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక వెండి ధర కూడా కుప్పకూలుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇటీవల రికార్డు గరిష్టాల నుంచి వరుసగా దిగొస్తుంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 1933 డాలర్ల వద్ద ఉండగా.. అదే స్పాట్ సిల్వర్ 22.67 డాలర్లకు పతనమైంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం రేట్లు ఇటీవల పడుతూనే ఉన్న విషయం తెలిసిందే. జీవనకాల గరిష్టాల నుంచి భారీగా పడిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గగా 10 గ్రాములకు రూ. 54,700 వద్ద ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 330 పడిపోగా.. 10 గ్రాములకు ప్రస్తుతం రూ.59,670కి చేరింది.
దేశ రాజధానిలో కూడా పుత్తడి రేటు పతనం కొనసాగుతోంది. ఇక్కడ 10 గ్రాములకు రూ.300 పడిపోగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850 వద్ద ఉంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే రూ.330 తగ్గి 10 గ్రాములకు రూ.59,820 వద్ద ట్రేడవుతోంది.