AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెడికల్​ కాలేజీల్లో రెండో రోజూ ఈడీ సోదాలు

రాష్ట్రంలో వివిధ మెడికల్​ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు జూన్​ 22న కూడా కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్​ సీట్లను బ్లాక్​ చేసి మేనేజ్​మెంట్​ కోటాలో అధిక మొత్తాలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో ఇవి జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్​ నగర్,సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు కళాశాలలే టార్గెట్ గా కనిపిస్తోంది. బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులకు చెందిన కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి.

మంత్రి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్​వైద్య కళాశాలలో సైతం ఈడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మొత్తం 6 కాలేజీల్లో ప్రారంభం కాగా కొన్నింట్లో పూర్తయ్యాయి. ఇందులో పలువురు అధికారులతో కూడిన బృందం పాల్గొంది.

ANN TOP 10