AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు బిజీ బిజీగా సీఎం కేసీఆర్ షెడ్యూల్..

దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా ముగింపు
దశాబ్ది ఉత్సవాల చివరి రోజు (గురువారం) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఉదయం మొదలుకుని రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆసియాలో అతిపెద్దదైన ‘డబుల్ బెడ్‌రూం’ గృహ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే దశాబ్దాల కల ప్రత్యేక తెలంగాణ సాకారమైన వేళ ఉద్యమ నేపథ్యంలో ప్రాణత్యాగం చేసిన వారిని నిత్యం స్మరించుకునేలా హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన తెలంగాణ అమర వీరుల అఖండ జ్యోతిని సిఎం కెసిఆర్ అలాగే రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా సర్వోగ్రూప్ నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 200 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిఎం పాల్గొననున్నారు. ఇట్లా పొద్దంతా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు రకాల ప్రోగ్రామ్స్‌తో బిజీ బిజీగా ఉండనున్నారు.

సాయంత్రం అమరజ్యోతిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ సమీపంలో అద్భుతంగా నిర్మించిన అమర వీరుల అఖండ జ్యోతిని గురువారం(జూన్ 22) ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. దీన్ని రూ.177.50 కోట్లు వెచ్చించి నిర్మించారు. ఓ వైపు హుస్సేన్ సాగర్, మరో వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీన్ని నిర్మించారు. కాగా, ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం దీని ప్రత్యేకత. గురువారం సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ఆరు వేల మంది కళాకారులు ప్రదర్శన చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సిఎం కెసిఆర్ ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. 12 తుపాకులతో అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు.

ANN TOP 10