AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘‘నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు” ..

గంగుల కమలాకర్ కు పొన్నం స‌వాల్
క‌రీంన‌గ‌ర్.. మంత్రి గంగుల క‌మలాక‌ర్ రైతుల గురించి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. దొంగ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఔట్ డేటెడ్ నేత అంటూ గంగుల చేసిన వ్యాఖ్యలపై పొన్నం కౌంటర్ ఇస్తూ, ‘‘ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల? నా ఓటమి గురించి మాట్లాడుతున్నావ్.. సీఎం కూతురు కవిత ఓడిపోలేదా? ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా?’’ అని నిలదీశారు.

‘గంగుల కమలాకర్.. నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు’’ అని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీజేపీ నేత బండి సంజయ్, మంత్రి గంగుల ఆలయాల్లో కలుసుకుంటున్నారని ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బెల్ట్ షాప్‌ల పండుగ మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు.

ANN TOP 10