AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదే’..

కేటీఆర్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు
‘ఎన్నికల్లో మద్యం పంచను.. పైసలివ్వను.. పోలీసులను నమ్ముకుని రాజకీయాలు చేయడం నాకు చేతకాదు’ అంటూ ఐటీ మంత్రి కేటీఆర్‌ కామెంట్స్ చేసారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను నమ్ముకుని వచ్చిన వాడినని.., వారి ఆశీర్వాదం ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మరింత అభివృద్ధి చేస్తానని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ట్వీట్ చేశారు. చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదేనని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

“పోలీసులను అడ్డుపెట్టుకోవడం లేదట ! ఓటర్లకు డబ్బు, మద్యం పంచట్లేదట ! చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదే. పోలీసులు అడ్డు లేనిదే అడుగు కూడా బయట పెట్టలేనోడు.. ముందుగానే ప్రశ్నించే గొంతులను హౌజ్ అరెస్టులు చేయించేటోడు.. అడ్డం పొడుగు మాటలు చెప్తే నమ్మే పిచ్చోళ్లు కాదు తెలంగాణ ప్రజలు. అన్నం పెట్టే రైతుకు బేడీలు వేసి, చంటి బిడ్డల తల్లులు అని చూడకుండా జైళ్లకు పంపిన హింసాత్మక పాలన మీది. పోలీసు వ్యవస్థను మీ బానిస వ్యవస్థగా మార్చారు.

ANN TOP 10