AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అరుదైన ఘటన.. మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు

హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళది వికారాబాద్ జిల్లా కాగా.. వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. ప్రస్తుతం మహిళ, పిల్లలు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోటబాస్ పల్లి గ్రామానికి చెందిన వడ్డె నవీన్, లక్ష్మి దంపతులు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ నెల 15వ తేదీన లక్ష్మికి పురిటినొప్పులు రావడంతో… వెంటనే కుటుంబసభ్యులు స్థానిక MCH ఆస్పత్రిలో జాయిన్ చేపించారు. అక్కడి వైద్యలు లక్ష్మీకి పరీక్షలు నిర్వహించి ఆరోగ్యాన్ని పరిశీలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడి వైద్యుల సూచనతో లక్ష్మీని కుటుంబసభ్యులు నీలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు.

నీలోఫర్ వైద్యులు లక్ష్మీకి డెలివరీ చేయగా.. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే తాము కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నామని, నిరుపేదలైన తమకు బిడ్డల పోషణ భారంగా మారుతుందని దంపతులు వడ్డె నవీన్, లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అయితే గతేడాది వీరికి గత ఏడాది ఆడ, మగ కవలలు జన్మించగా.. వాళ్లు మరణించారు. ఇప్పుడు మళ్లీ పిల్లలు పుట్టడంతో సంతోషంగా ఉన్నా.. పిల్లలు పోషణ కష్టంగా మారిందని అంటున్నారు.

ANN TOP 10