AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జయశంకర్ కలను సాకారం చేసిన కేసీఆర్ : ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి, జూన్ 21 ప్రభన్యూస్, తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సీఎం కేసీఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయ‌న చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. . తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు.

ANN TOP 10