AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శంకరమ్మకు కేసీఆర్ నుంచి పిలుపు!.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకేనా?

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ (BRS) అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ఆమెను మంత్రి జగదీష్‌రెడ్డి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) హామీ మేరకు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే శంకరమ్మను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని చర్చ నడుస్తోంది.

కొద్ది రోజులుగా శంకరమ్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శంకరమ్మకు పదవి కట్టబెట్టి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాధారణ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆ దిశగా సన్నద్ధమవుతున్నాయి.

ANN TOP 10