AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నార్సింగిలో దారుణం.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది

హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ కత్తి పడగ విప్పింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతిపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో మెుక్కలు కత్తిరించే కట్టర్‌తో గొంతులో పొడిచాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గ్రామానికి చెందిన యువతి (22) గచ్చిబౌలిలోని ఓ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గణేష్.. గచ్చిబౌలి ఇందిరా నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బాధిత యువతికి నిందితుడు గణేష్ మేన బావ వరసవుతాడు. కొంతకాలంగా గణేష్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని ఆమెపై ఒత్తడి తెస్తుండగా.. ఇష్టం లేదని యువతి నిరాకరిస్తూ వస్తుంది.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి యువతి ఉంటున్న హాస్టల్‌కు గణేష్ చేరుకున్నాడు. నీతో మాట్లాడాలంటూ ఆమెను బైక్‌పై ఎక్కించుకొని దగ్గరలోనే ఉన్న టీ గ్రిల్ హోటల్ వెనుక వైపు తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక గణేష్ మరోసారి ప్రేమ, పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. గణేష్ ప్రపోజల్‌ను యువతి తిరస్కరించింది. దీంతో కోపోద్రిక్తుడైన గణేష్ బ్యాగులో తన వెంట తెచ్చుకున్న మెుక్కలు కట్ చేసే కట్టర్‌తో ఆమె గొంతుపై పొడిచాడు. అడ్డుకోవటానికి చేసిన యత్నంలో వాసవి చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

దాడిని గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే 100కు కాల్ చేసి విషయం చెప్పాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకగడా ఉందని వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ANN TOP 10