తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బుధవారం (జూన్ 21న) తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 24 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, జూన్ 25 నుంచి స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని తెల్పింది. శనివారం నుంచి రైతులు పనులు ప్రారంభించుకోవచ్చని సూచించింది. కర్ణాటక – ఏపీ సరిహద్దుల వద్ద జూన్ 11న రుతుపవనాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ వల్ల రుతు పవనాల్లో కదలిక ప్రారంభమైంది. సోమవారం నాటికి రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
