హైదరాబాద్ : ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్లు కలకలం రేపాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనంతరం మందుబాబులు చెలరేగిపోయారు. మద్యం మత్తులో కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కరోజే మూడు కత్తిపోట్ల ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ మూడు ఘటనల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణోత్సవం అనంతరం గత రాత్రి జరిగిన ఘటనలుగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
