AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆడపిల్ల పుట్టడం అపురూపం..

మంచి ఘడియల్లో పాప జన్మించిందన్న చిరంజీవి
మెగా ఫ్యాన్స్‌కు రామ్​చరణ్​ తీపికబురు అందించడంతో తాతయ్య మెగాస్టార్​చిరంజీవి కూడా ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. ట్విట్టర్​వేదికగా తన మనవరాలికి వెలకమ్​చెప్పిన మెగాస్టార్.. లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావుఅంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.

మెగా లిటిల్ ప్రిన్సెస్‌కు వెల్‌కమ్‌ చెబుతూ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. తల్లిదండ్రులైనందుకు మీ ఇద్దరికీ అభినందనలు. కూతురితో గడిపిన ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. సంతోషంతో హాస్పిటల్‌కి మెగా, కామినేని కుటుంబ సభ్యులు క్యూ కట్టారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ హాస్పిటల్‌కి వచ్చి రామ్ చరణ్, ఉపాసనకు విషెస్ చెప్పారు.

చిరంజీవి మాట్లాడుతూ.. చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కావాలని మేము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. ఇది మాకు ఎంతో అపురూపం అన్నారు చిరంజీవి. చరణ్ కు పాప పుట్టడం చాలా సంతోషంగా ఉంది. మంచి ఘడియల్లో పుట్టింది పాప. మా ఎంతో ఇష్టదైవం అయిన ఆంజనేయుడికి ఇష్టమైన రోజున పాప పుట్టడం ఆనందంగా ఉంది. ముందునుంచి మా ఇంట్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చరణ్ ఎదుగుదల.. ఎంతో సాధిస్తున్నాడు.. ఇటీవలే వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది చాలా ఆనందంగా ఉంది. మా కోసం వచ్చి రామ్ చరణ్ ఉపాసన ను ఆశీర్వదించిన అందరికి, ఆ అభిమానులకు నా కృతజ్ఞతలు అన్నారు.

ANN TOP 10