రోడ్డు పై వెళుతున్న ముగ్గురిపై దాడి
రంగారెడ్డి: జిల్లాలోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి ఓ యువకుడు హంగామా సృష్టించాడు. సర్దార్ జీ మన్‌ప్రీత్‌సింగ్ అనే యువకుడు తల్వార్‌ను పట్టుకుని రెచ్చిపోయాడు. రోడ్డు పై వెళుతున్న ముగ్గురిపై దాడి చేశాడు. తల్వార్‌తో విచక్షణారహితంగా పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. తల్వార్‌తో రెచ్చిపోయిన యువకుడిని చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో అడ్డువచ్చిన వారిపై యువకుడు తల్వార్‌తో దాడికి యత్నించాడు. సర్దార్ జీని చూసి స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనపై స్థానికులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సర్దార్ జీ దాడిలో సయ్యద్ అక్బర్, మోను సింగ్‌తో పాటు రెండు సంవత్సరాల చిన్నారి అఖిల్ కత్తి పోట్లకు గురయ్యారు.