హరితోత్సవం అద్భుతం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో..
ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఇన్ ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్: సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం పథకం.. తెలంగాణకు హరిత శోభ తెచ్చిందని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్దన్ రెడ్డి అన్నారు. హరితహారం పథకాన్ని భారత పార్లమెంట్ మెచ్చుకున్నదని, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ప్రత్యేకంగా గుర్తించాయని ఆయన అన్నారు.
సోమవారం దశాబ్ది ఉత్సవాల ‘హరితోత్సవం’ కార్యక్రమంలో భాగంగా.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, హాస్పిటల్ సీఈవో ప్రభాకర్ లతో కలిసి ఆయన మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.