కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కంది కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణం నలుమూలల నుండే కాకుండా జైనథ్, బేల మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రజాసేవా భవనం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్‌చౌక్, వినాయక్ చౌక్, అశోక్‌రోడ్, గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్, శివాజీచౌక్, ఠాకూర్ హోటల్, పంజాబ్ చౌక్, బస్టాండ్ మీదుగా తిరిగి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు ఆఫీసుకు చేరుకుంది. దారి పొడవునా జై రాహుల్‌గాంధీ, జై కాంగ్రెస్ నినాదాలు హోరెత్తాయి. అనంతరం క్యాంపు ఆఫీసులో భారీ కేక్‌ను కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
బాణాసంచి కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎగరబోయేది కాంగ్రెస్ జెండాయేనని దీమా వ్యక్తం చేశారు. తాను పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగిందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతోందని అన్నారు. పేదలు, గరిబోళ్ల పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకుంటామని, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పేర్కొన్నారు.
ఘర్ వాపసీ ద్వారా అనేక మంది తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని, వారందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ప్రజాద్రోహి, బీసీ ద్రోహి జోగు రామన్నను ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌కు అద్భుతమైన ప్రతిస్పందన వస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం నుండి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయన్నారు. ఒక విజన్‌తో ముందుకెళ్తున్న రాహుల్‌గాంధీని భావిభారత ప్రధానిని చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
అంతకు ముందు బేల మండలం డోప్టాల నుండి పెద్ద సంఖ్యలోతరలివచ్చిన ప్రజలు కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్‌రావు, నాగర్‌కర్ శంకర్,పిడుగు స్వామి యాదవ్ , అల్లూరి అశోక్ రెడ్డి,పోతారాజు సంతోష్, షైక్ షహీద్, మెస్రం చిత్రు,సంజీవ్,సంతోష్ రెడ్డి, కిష్టా రెడ్డి, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, సాట్ల నాగన్న, లస్మారెడ్డి, రామ్ సింగ్, ప్రతాప్ రెడ్డి, పొచ్చిరాం,సుదర్శన్,కాంగ్రెస్ పార్టీ బేలా మండలం ప్రెసిడెంట్ ఫైజుల్లా ఖాన్, వామన్ వంకాడే, భోక్రే శంకర్, ఎం. డి అఖిల్, సవాపురే విలాస్ పటేల్,గోపత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.