తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడు: కొండా మురళి
వరంగల్: ‘నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా.. నన్ను రౌడీ అంటున్నావు.. మీ పార్టీ నాకెలా ఎమ్మెల్సీ ఇచ్చింది. శ్రీకృష్ణదేవరాయులు వంశంలో పుట్టినోళ్లం. మీసాలు మెలేస్తం. నువ్వు ఆడది కాదాయే.. మొగోడివి కాదాయె.. మీసాలు లేక ఎవరో తెలియకపాయె.. మీసాలుంటే మెలేస్తే బుద్ధివంతుడివి, ధైర్యవంతుడివి అనుకునేవాళ్లం’ అని కొండా మురళి, కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత కొండా మురళి-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ (KTR)లో మొదలైన విమర్శలు పర్వానికి ఇప్పట్లో బ్రేక్ పడేటట్లు కనిపించడం లేదు. మురళి-బీఆర్ఎస్ నేతలు తగ్గేదేలే అన్నట్లుగా సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలపై మురళి (Konda Murali) ఈ రోజు తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడని తెలిపారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నాడు కాబట్టే కవిత అరెస్ట్ కాలేదని చెప్పారు. ‘‘నాకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని కలిసి పరకాల టికెట్ అడుగుతా. అధిష్టానం ఒప్పుకుంటే పరకాలలో నేనే నిలబడతా. కొండా సురేఖని వరంగల్‌లో గెలిపిస్తా.. నేను పరకాలలో గెలుస్తామని కొండా మురళి వ్యాఖ్యానించారు.