తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని పనులు జరుగుతాయి. ఈ నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు వస్తాయి. మహేశ్వరం దాకా మెట్రో రైలు ఆటోమేటిక్‌గా వస్తది. అటు బీహెచ్ఈఎల్.. ఇటు ఇక్కడి దాకా వస్తది. మళ్లీ మనమే గెలుస్తం.. అందులో డౌట్ లేదు. బ్రహ్మాండంగా మనమే ఉంటాం కాబట్టి.. ఒక పద్ధతిలో వచ్చే టర్మ్‌లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.