తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఇంకా రాలేదు. రాయలసీమ నుంచి రుతుపవనాలు ముందుకు కదలలేదు. ఈ నెల 11న ఎపిలోకి ప్రేవేశించిన నైరుతిపవనాలు అక్కడే స్తంభించిపోయాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు శ్రీహరికోట, కర్నాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఈ పాటికి దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో నైరుతిపవనాలు విస్తరించాల్సిఉంది.
