AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నల్లగా ఉన్నానని అంటే అగ్గిలా మారుతా

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై
హైదరాబాద్‌: ‘‘నేను నల్లగా ఉన్నానంటూ కొందరు అదే పనిగా ట్రోల్‌ చేస్తున్నారు. నా నుదురు బట్టతలలా ఉంటుందని హేళన చేస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్న.. నల్లగా ఉన్నావని అంటే.. అగ్గిలా మారతా. నన్ను ట్రోల్‌ చేసే వారు ఉహించనంత ఉన్నత స్థాయికి వెళతా.’’ అని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యనించారు. తన శరీర ఛాయపై కొందరు పదే పదే విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఆవేదన వ్యక్తం చేసారు. బాడీ షేమింగ్‌ కామెంట్‌పై గవర్నర్‌ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నై తండయార్‌పేటలోని ఓ బాలికల పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌కే పరిమితం కావాలి కానీ బీజేపీ తరఫున రాజకీయాలు చేయడం ఏమిటని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ గవర్నర్‌ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. విమర్శలను తాను పట్టించుకోనని గవర్నర్‌ అన్నారు. కష్టపడి పని చేయటమే తనకు తెలుసునని అన్నారు.

ANN TOP 10