AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తల్లిని చంపి.. సూట్‌కేసులో కుక్కి..

పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన కూతురు
తల్లితో చాలాసేపు గొడవ పడిన కుమార్తె ఆ తర్వాత సహనం కోల్పోయి ఆమెను చంపేసి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. సూట్‌కేసులో ఆమె తీసుకొచ్చిన తల్లి శవాన్ని చూసి షాకైన పోలీసులు ఆ తర్వాత తేరుకుని అరెస్ట్ చేశారు. తల్లి తనతో రోజూ గొడవ పడుతోందని, అందుకే ఆమెను చంపేశానని ఆమె అంగీకరించింది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10