AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు గద్వాలకు సీఎం కేసీఆర్‌..

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో గద్వాల పట్టణం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు.

ANN TOP 10