AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రారంభమైన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు చేసింది.

గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై ఇప్పటికే సిఎస్‌ సహా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే 1,995 మందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఈ పరీక్ష నిర్వహణకు కలెక్టర్లను డిస్ట్రిక్ట్‌ అథారిటీగా, అడిషనల్‌ కలెక్టర్లను ఛీఫ్‌ కో ఆర్డినేటర్లుగా నియమించారు. 994 మంది ఛీఫ్‌ సూపరింటెండెంట్లను, 994 లైసనింగ్‌ అధికారులను, 310 రూట్‌ ఆఫీసర్లను నియమించారు. వారితో టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ బి.జనార్ధ¯Œ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, పరీక్షల విభాగం ప్రత్యేకాధికారి బిఎల్‌ సంతోష్‌ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి, పరీక్షా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా చర్చించారు. మొత్తం 503 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీచేసిన టిఎస్‌పిఎస్‌సి, అక్టోబర్‌ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించారు.

ANN TOP 10