AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యువతి హల్‌చల్..

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ యువతి హల్‌చల్ చేసింది. బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించింది. విమానాశ్రయ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, శ్వేత ప్రేమికులు. వీరు హైదరాబాద్‌లో ఓ కంపెనీ స్థాపించి ఆ తర్వాత లైఫ్‌లో సెటిల్ కావాలని నిర్ణయం తీసుకున్నారు.

అందులో భాగంగా శుక్రవారం రాత్రి వీరు బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఒకర్నొకరు మాటా మాటా అనుకున్నారు. మనస్థాపం చెందిన శ్వేత.. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. విమానాశ్రయంలోని బ్రిడ్జి పైనుంచి దూకాలని భావించింది. ఆమె బ్రిడ్జిపైకి చేరుకోగానే.. తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి, శ్వేతలకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.

ANN TOP 10