AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డిగ్రీ అర్హతతో భారత్ డైనమిక్స్ లో మేనేజర్ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. సంస్థలోని పలు ఖాళీల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులతో పాటు ఇతర విభాగాలలోని పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలు..
ఖాళీలు, కావాల్సిన అర్హతలు..
డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైనర్‌, మైక్రోవేవ్‌ డిజైనర్‌, కంప్యూటర్‌ విజన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, క్యూసీ మెకానికల్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, పీసీబీ డిజైనర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత పొందాలి.
ముఖ్యమైన అంశాలు…
– అభ్యర్థులు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
– అర్హతకల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
– దరఖాస్తులు పరిశీలించి షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
– ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40 వేల నుంచి రూ.1.6 లక్షల వరకు చెల్లిస్తారు
– ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

ANN TOP 10