AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభాస్‌ న్యూ లుక్‌ వైరల్‌..

కొన్ని రోజులుగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఆయన లుక్‌ నెట్టింట వైరల్‌ గా మారింది. ప్రభాస్‌ కొత్త లుక్‌ చూసి ఎగిరి గంతేస్తున్నారు రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌. ఎప్పటిలాగే ఆయన పెళ్లి గురించిన వార్తలు వైరల్‌ కాగా.. ఆయన అనారోగ్యం బారిన పడ్డారనే న్యూస్‌ మాత్రం ప్రభాస్‌ అభిమానుల్లో ఆందోళన నింపింది.

రీసెంట్‌ గా రాధే శ్యామ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్‌.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తో చేస్తున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ఫినిష్‌ చేసి లైన్‌ లో ఉన్న సినిమాలపై ఫోకస్‌ పెట్టారు ప్రభాస్‌.

ANN TOP 10