హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా నలుగురు విద్యార్థులు కాపీ కొట్టారు. స్మార్ట్ కాపీయింగ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లాకు చెందిన ఎస్‌ఎస్‌సి, ఇంటర్ టాపర్ కీలక సూత్రదారిగా ఉన్నాడు. తన మిత్రుల కోసం కడప విద్యార్థి స్మార్ట్ కాపీయింగ్ చేశాడు. సికింద్రాబాద్‌లోని ఎస్‌విఐఇ సెంటర్‌లో కాపీయింగ్ జరిగింది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లినట్టుగా తెలిసింది. వారు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది. సికింద్రాబాద్, మల్లాపూర్, మౌలాలి, ఎల్బీనగర్ పరీక్ష కేంద్రాల్లో ఇలాంటి మాస్ కాపీయింగ్ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లో ఉన్న విద్యార్థి మొబైల్ నుండి మిగతా వారికి సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా తెలిసింది. మొబైల్ వాడుతున్నాడని గుర్తించిన ఇన్విజిలేటర్ వారిని పట్టుకుని వెంటనే అధికారులకు సమాచారం అందించారు ఇన్విజిలేటర్. దీంతో మిగతా పరీక్షా కేంద్రాల్లోని ముగ్గురు విద్యార్థులను పట్టుకున్నారు అధికారులు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ సంచలనం రేపుతోంది. ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కాపీ చేసిన నలుగురు విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మార్ట్ కాపీయింగ్ పై హైదరబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లాకు చెందిన ssc, ఇంటర్ లో టాపరే ఈ కేసులో కీలక సూత్రధారిగా తెలిసింది. కడప విద్యార్థి తన మిత్రుల కోసం స్మార్ట్ కాపీయింగ్ చేసినట్టుగా తెలిసింది. సికింద్రాబాద్లోని ఎస్ వి ఐ ఈ సెంటర్లో కాపీయింగ్ జరిగింది. తాను రాసిన జవాబు పేపర్ వాట్సప్ ద్వారా మిత్రులకు షేర్ చేశాడు విద్యార్థి. వివిధ సెంటర్లో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా జవాబు పత్రం చేరవేశాడు. Dilsuknagar లో కడప విద్యార్థిని ఫ్రెండ్స్ నీ పట్టుకున్నారు అబ్జర్వర్. ఎస్ వి ఐ ఈ సెంటర్ నుంచి జవాబు పేపర్ వచ్చినట్లు గుర్తించారు. కడప జిల్లా టాపర్ నీ అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు అబ్జర్వర్.