పౌర్ణమి రోజు ఆకాశంలో అందమైన, ఆకర్షణీయమైన దృశ్యం కనువిందు చేసింది. పౌర్ణమి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆకాశంలో స్ట్రాబెర్రీలా మెరుస్తున్న చంద్రుని ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం పౌర్ణమినాటి చంద్రుని అద్భుత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేకమైన ‘స్ట్రాబెర్రీ మూన్’ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూసి ఆనందించారు. ఇది రాత్రి ఆకాశంలో పింక్ కలర్ చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపించింది. దీనినే ‘స్ట్రాబెర్రీ మూన్’ని ‘రోజ్ మూన్’ అని కూడా అంటారు. నెటిజన్లు చంద్రుడి అందమైన ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారు..
‘స్ట్రాబెర్రీ మూన్’ అంటే పింక్ చంద్రుడు కాదు. అమెరికాలోని గిరిజన తెగలు జూన్ నెలలో వచ్చే పౌర్ణమికి ‘స్ట్రాబెర్రీ మూన్’ అని పేరు పెట్టారు. అమెరికాలో స్ట్రాబెర్రీల పంట కాలం ప్రారంభంలో వచ్చే పౌర్ణిమ కావడంతో అక్కడ పురాతన కాలంలో వారు ఈ పౌర్ణిమకు స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టుకున్నారు. ఈ పౌర్ణిమ కు ప్రపంచంలో వేర్వేరు పేర్లున్నాయి. ఐరోపాలో దీనిని రోజ్ మూన్ అని పిలుస్తారు. ఇది గులాబీల పెంపకాన్ని సూచిస్తుంది.