AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్‌ జిల్లాలోని కాన్పా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కారు నాగ్‌పూర్‌ నుంచి నాగ్‌భీడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. గాయపడినవారిలో మహిళతోపాటు చిన్నారి ఉందన్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తరలించామన్నారు.

ANN TOP 10