AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో భూపాల్ పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌లో భూపాల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌తో సుడో పోలీస్ అవతారమెత్తి ఓ ముఠా లక్షలు కాజేసినట్టు పోలీసులు తెలిపారు. అల్కాపురి కాలనీలో భోపాల్ పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బు చెల్లిస్తామని హవాలా ఏజెంట్లను గ్యాంగ్ నమ్మిస్తోంది. భారీగా డిపాజిట్ చేస్తామని బెట్టింగ్ యాప్ హెల్ప్ డెస్క్ ద్వారా లోకల్ ఏజెంట్ల ఫోన్ నంబర్స్‌ను సదరు ముఠా తీసుకుంది. హవాలా ఏజెంట్లు రాగానే తాము పోలీసులమని గ్యాంగ్ నమ్మిస్తోంది.

అప్పటికే ఏజెంట్ వద్ద ఉన్న డబ్బుతో పాటు మనీ రిసీవ్డ్ అని బెట్టింగ్ యాప్‌కు మెసేజ్ పంపిస్తున్నారు. నిందితుల బెట్టింగ్ యాప్ వాలేట్‌లో డబ్బు డిపాజిట్ అయిన వెంటనే ఆ డబ్బును తమ ఖాతాకు సూడో పోలీస్ గ్యాంగ్ బదిలీ చేసుకుంటుంది. పలు రాష్ట్రాల్లో ఇదే తరహా విధానాన్ని గ్యాంగ్ అమలు చేసింది. గత వారం భోపాల్‌లో సదరు ముఠా 20 లక్షలు కాజేసింది. నగరానికి వచ్చి అల్కాపురీ కాలనీలో నలుగురు నిందితులు ఉంటున్నారు. మరో ఇద్దరు నిందితులు కృష్ణ, మహేష్‌లను భోపాల్‌లో పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన నిందితులు సతీష్, ప్రదీప్, అనిల్, శేఖర్ కోసం నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ANN TOP 10